Farm House Case: గుత్తా సుమన్‌ వాట్సప్‌ చాటింగ్‌పై పోలీసుల ఆరా..

మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో భాగంగా

Updated : 05 Nov 2021 12:52 IST

ముగిసిన కస్టడీ.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ కస్టడీ విచారణ ముగిసింది. దీంతో అతడిని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరోవైపు కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సుమన్‌ ఫోన్‌లోని వాట్సప్‌ చాటింగ్‌ను పరిశీలించి దానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలు నిర్వహించారని ప్రశ్నించారు. 

ముఖ్యంగా హైదరాబాద్‌ శివారుల్లోని ఫాంహౌస్‌లతో సుమన్‌కు ఉన్న లింకులపై ఆరా తీశారు. హైదరాబాద్‌తో పాటు శ్రీలంక, గోవాలో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ కేసులో సుమన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని