Crime News: మాజీ సర్పంచ్‌నుప్రజాకోర్టులో శిక్షించాం: లేఖలో మావోయిస్టులు

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారు.

Updated : 22 Dec 2021 15:35 IST

ఏటూరు నాగారం: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. రెండు రోజుల కిందట రమేశ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో అతడిని చంపేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి సమీపంలో మాజీ సర్పంచి మృతదేహాన్ని గుర్తించారు. రమేశ్‌ను ప్రజాకోర్టులో శిక్షించినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందునే చంపినట్లు వెల్లడించారు. వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని