AP News: పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టుల పరారీ

ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు తారాసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు..

Updated : 22 Sep 2021 12:40 IST

విశాఖ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. విధుల్లో ఉన్న పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీవీఎఫ్‌, ఎస్‌వోజీ బలగాలు తులసిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని