Updated : 01 Sep 2021 17:21 IST

Suicide: శిశువుకు జన్మనిచ్చిన మైనర్‌ బాలిక.. ఆపై బావిలో దూకి ఆత్మహత్య

గాంధారి: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక (16) మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి సమయంలో ముళ్ల పొదల్లో శిశువును వదిలేసి సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఐసీడీఎస్‌ అధికారులు.. ముళ్లపొదల్లో ఉన్న శిశువును రక్షించి అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బావి నుంచి మైనర్‌ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్య నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పెళ్లికాకుండానే తల్లి కావడంతోనే మనస్తాపంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని