Crime News: శిల్పాచౌదరిని ప్రశ్నిస్తున్న నార్సింగ్‌ పోలీసులు... వివరాలు రాబట్టేందుకు యత్నం

పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న

Updated : 10 Dec 2021 19:05 IST

హైదరాబాద్‌: పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నార్సింగ్‌ ఎస్‌ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శిల్పా చౌదరిపై నార్సింగ్‌ పీఎస్‌లో 3 కేసులు నమోదయ్యాయి. రూ.7కోట్లు మోసం చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరి కొంత మంది నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు. శిల్పా ఇంట్లో నుంచి పోలీసులు ఇప్పటికే పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. శిల్పా చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల పాటు ప్రశ్నించి .. ఆమె వద్ద నుంచి పలు వివరాలు సేకరించేందుకు నార్సింగ్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని