Bihar: ఒకే కుటుంబంలోని నలుగురిని ఉరితీసిన మావోయిస్టులు

బిహార్​లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని ఇంటి బయటే ఉరితీశారు. గయాలోని మౌన్​బార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.....

Updated : 15 Nov 2021 01:42 IST

గయా: బిహార్​లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఇంటి బయటే ఉరితీశారు. గయాలోని మౌన్​బార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సలైట్లు ఉరి తీసి హత్య చేశారు. అనంతరం వారి ఇంటిని బాంబులతో పేల్చారు. ఈ కుటుంబంలోని వ్యక్తులు పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవరిస్తున్నారని నక్సలైట్లు గ్రామంలో పోస్టర్లు అంటించారు. పోలీసులకు వీరు సమాచారం ఇవ్వడంతోనే గతంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.

మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు శనివారం ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్‌ఫార్మర్లనే అనుమానంతోనే మావోయిస్టులు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్​స్టేషన్​పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఘటనా స్థలంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని