Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌ కస్టడీ.. మరికొంత సమయాన్ని కోరిన ఎన్సీబీ

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ వ్యవధిని అక్టోబరు 11 వరకు పొడిగించాలని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) కోర్టుని కోరింది.

Updated : 04 Oct 2021 21:11 IST

ముంబయి: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ వ్యవధిని అక్టోబరు 11 వరకు పొడిగించాలని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) కోర్టుని కోరింది. పూర్తి స్థాయిలో విచారించకపోతే ఈ డ్రగ్స్‌ని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే విషయాలు ఎలా తెలుస్తాయని, అందుకే మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. ముంబయి నగర శివారు తీరప్రాంతంలోని కార్డెలియా క్రూజ్‌ ఎంప్రెస్‌ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న ఎన్సీబీ అధికారులు దాడులు జరిపి, ఆర్యన్‌ సహా మరికొందరిని అరెస్ట్‌  చేసిన సంగతి తెలిసిందే. ముంబయి కోర్టు ఆర్యన్‌కి ముందుగా అక్టోబరు 4 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. ఆ సమయం సరిపోదని ఎన్సీబీ కోర్టుని కోరింది. ఆర్యన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది నతీశ్‌ మనేషిండే వాదిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని