Shalu Chourasiya: చౌరాసియాపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సినీ పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తున్న బాబు అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.....

Updated : 20 Nov 2021 12:21 IST

హైదరాబాద్‌: నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సినీ పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తున్న బాబు అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న బాబు ఇంటిలో షాలూ ఐఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు. విజయవాడ, బంజారాహిల్స్‌, గోల్కొండ పీఎస్‌ల్లో అతడిపై గతంలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గోల్కొండ పీఎస్‌లో నమోదైన కేసులో కొంతకాలంపాటు జైలులో కూడా ఉన్నాడు.

నటి షాలూ.. ఈ నెల 14న సాయంత్రం కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లింది. రాత్రి 8 ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షాలూపై దాడి చేసి.. ఆమె ఐఫోన్‌ని తీసుకుని పారిపోయాడు. దీంతో షాలూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు