Crime News: కడ్డీలు, పేస్ట్‌ రూపంలో బంగారం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నలుగురి అరెస్టు

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన

Updated : 10 Dec 2021 21:52 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో కస్టమ్స్‌ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన నలుగురు సుడాన్‌ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గోల్డ్‌ బార్స్‌, పేస్ట్‌ రూపంలో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి రూ.3.60 కోట్లు విలువైన 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని