Crime News: కడప జిల్లాలో కరుడగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌

కరుడగట్టిన ముగ్గురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై కడప జిల్లా పోలీస్‌అధికారి అన్బురాజన్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. జిల్లాలోని చాపాడు మండలం ఖాదర్‌పల్లికి

Published : 30 Dec 2021 01:23 IST

కడప: కరుడగట్టిన ముగ్గురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై కడప జిల్లా పోలీస్‌అధికారి అన్బురాజన్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. జిల్లాలోని చాపాడు మండలం ఖాదర్‌పల్లికి చెందిన షేక్‌ చాంద్‌ బాషా, ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లెకు చెందిన జంగాల వీరభద్రయ్య, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన షరీఫ్‌ ఏడేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. చాంద్‌ బాషాపై 2014 నుంచి ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. జంగాల వీరభద్రయ్యపై 32 కేసులు, షరీఫ్‌పై 8 కేసులు నమోదయ్యాయి. వీరంతా తమిళనాడు రాష్ట్రం నుంచి కూలీలను తీసుకొచ్చి జిల్లాలోని భాకరాపేట, సిద్ధవటం, అట్లూరు, రాయచోటి, గువ్వలచెరువు ఘాట్‌రోడ్డు, వీరబల్లి, సుండుపల్లి, రైల్వే కోడూరు తదితర అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు నరికి దుంగలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లకు వాటిని విక్రయించి రూ.లక్షలు సొమ్ము చేసుకునేవారు. వీరి వల్ల ఎర్రచందనం అడవులకు సమస్యగా మారుతుందని భావించిన జిల్లా ఎస్పీ ముగ్గురు నిందితులపై పీడీయాక్టు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ విజయరామరాజును కోరగా.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ముగ్గురిపై పీడీయాక్ట్‌ నమోదు చేసి కడప కేంద్రగారానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని