Saidabad: హంతకుడు ఎక్కడ?రాజు కోసం జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు

సైదాబాద్‌ ఠాణా పరిధిలోని ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేలమందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. మద్యం దుకాణాలు,

Updated : 16 Sep 2021 07:57 IST

ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం వద్ద ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సైదాబాద్‌: సైదాబాద్‌ ఠాణా పరిధిలోని ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజును పట్టుకునేందుకు రాజధాని నగరాన్ని వేలమందితో కూడిన ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, కల్లుకాంపౌండ్లకు పోలీసులు వెళ్లి ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రకటించిన రెండు ఫోన్‌ నంబర్లకు వందలకొద్దీ కాల్స్‌ వస్తున్నాయి. నిందితుడిని పోలి ఉన్న వ్యక్తుల ఫొటోలు పంపుతున్నారని ఉత్తర మండలం సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌రెడ్డి తెలిపారు. రాజు వివరాలున్న ఫొటోలను హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోని బస్సులు, ఆటోలకు అతికించారు. హైదరాబాద్‌ పోలీసులు గణేశ్‌ మండపాల వద్ద మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.


రాజు.. ఓ ఉన్మాది...

హంతకుడు పలకొండ రాజు మద్యానికి బానిసై పైశాచికంగా ప్రవర్తించేవాడని తెలుసుకున్నారు. ఉన్మాదిలా ప్రవర్తించేవాడని గుర్తించారు. మేనకోడలు పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. చస్తానంటూ బెదిరించి ఓ యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుని తర్వాత ఆమెను విపరీతంగా కొట్టేవాడని బంధువులు పోలీసులకు చెప్పారు. ఒకరోజు మద్యం తాగి పీక మీద కాలుపెట్టి చంపబోతే ఆమె భయంతో పాపను తీసుకుని పారిపోయిందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని