Crime News: సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావు ఆచూకీ చెబితే పారితోషకం: పోలీసులు

వ్యాపారవేత్త, సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. శ్రీధర్‌రావు ఆచూకీ తెలిపిన

Published : 01 Dec 2021 01:38 IST

హైదరాబాద్‌: వ్యాపారవేత్త, సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. శ్రీధర్‌రావు ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వడంతో పాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లోని ప్లాట్‌ నెంబర్‌ 13, 14, 15లో నివాసముంటున్న శ్రీధర్‌రావుపై నగరంలోని నార్సింగ్, రాయదుర్గం, గచ్చిబౌలితో పాటు వివిధ ఠాణాల్లో .. పలువురిని మోసం చేసినట్టు కేసులున్నాయి. అతను తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని