TS NEWS: పునాదులు తవ్వుతుంటే .. 98 బంగారు నాణేలు బయటపడ్డాయ్‌!

ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుంటే బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రమైన

Published : 05 Aug 2021 01:47 IST

గద్వాల: ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుంటే బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రమైన మనపాడులో జరిగింది. బంగారు నాణేలు తీసుకున్న తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

 పోలీసుల కథనం ప్రకారం... జనార్దన్‌రెడ్డికి చెందిన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు బయటపడినట్లు పత్రికల్లో కథనాలు రావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటినిర్మాణ పనుల్లో పాల్గొన్న తొమ్మిది మంది కూలీలను  అదుపులోకి తీసుకుని విచారించారు.  పునాదులు తవ్వుతుంగా కుండ బయటపడిందని, అందులో 98 బంగారు నాణేలు ఉన్నాయని కూలీలు విచారణలో అంగీకరించారు. బంగారు నాణేల విషయం ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందని తెలిపారు. బంగారు నాణేలను కొందరు ఆభరణాల రూపంలోకి మార్చుకోగా, మరి కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కూలీల వద్ద నుంచి 12.12 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వివరించారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని