HYD: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన.. నేరాన్ని అంగీకరించిన సెక్యూరిటీ గార్డు

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన

Updated : 19 Aug 2021 14:15 IST

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యమైంది. హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకొని ఘటనపై విచారించారు.

మహబూబ్‌నగర్‌కు పోలీసులు..

మహబూబ్‌నగర్‌ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చిన అంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ మహబూబ్‌నగర్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన మరి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కా చెల్లెళ్లు మద్యం ఉపసంహరణ లక్షణాల(ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌)తో ఉన్నారని గుర్తించారు. అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.  ఈ కేసులో బాధితురాలిని మహిళా పోలీసులు బుధవారం రహస్య ప్రాంతంలో విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరో మారు రికార్డు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని