
Crime News: పంజాగుట్ట బాలికది హత్యే!
కడుపులో బలంగా తన్నడం వల్లే మృతి
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలిక మృతదేహాన్ని ఓ మహిళ వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని ఎక్కడో చంపేసి నిందితులు ద్వారకాపురి కాలనీలో పడేశారు. నిందితులను సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. వారు వెళ్లిన మార్గంలో ఉన్న మరిన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం 4 పోలీస్, 3 టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 4న ద్వారకాపురి కాలనీలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.