crime news: రాహుల్‌ది హత్యే.. పోలీసులకు ఆధారాలు లభ్యం 

బెజవాడ నగరంలో  కలకలం రేపిన కారులో మృతదేహం కేసులో పురోగతి లభించింది. మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురు రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహాన్ని ఈరోజు

Updated : 19 Aug 2021 17:49 IST

విజయవాడ: బెజవాడ నగరంలో  కలకలం రేపిన కారులో మృతదేహం కేసులో పురోగతి లభించింది. మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురు రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహాన్ని ఈరోజు ఉదయం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృతుడు జడ్‌ఎక్స్‌ఎన్‌ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన రాహుల్‌గా పోలీసులు తెలిపారు. తొలుత పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ కారులో లభ్యమైన ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా హత్యగా నిర్ధారించారు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కారులోని తాడు, దిండు, నీటి సీసాలను క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. రాహుల్‌ మెడ కమిలిపోయి ఉండటాన్ని పోలీసులు గమనించారు. హత్య ఘటనపై  సాయంత్రం పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్‌ కంపెనీ ఉంది. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం ఉదయం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు టవర్‌ లొకేషన్‌ పరిశీలించగా మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురుగా చూపించింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే కారులో మృతదేహం కనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని