
ఓఆర్‌ఆర్ వద్ద యాక్సిడెంట్: ఏసీపీ కుటుంబసభ్యులు దుర్మరణం
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏసీపీ కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందగా..ఒకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఏసీపీ సతీమణి శంకరమ్మ, ఆయన సోదరుడి కుమారుడు భాస్కర్ దంపతులు ఉన్నారు. ఏసీపీ సోదరుడు బాలకృష్ణ గాయాలపాలవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.