Published : 07/12/2021 02:08 IST

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం

గుమ్మగట్ట: అనంతపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాయదుర్గం నుంచి వెళ్తు్న్న ఆటో.. గోనబావి నుంచి వస్తున్న జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను గొల్ల మహేంద్ర (4), రక్షిత (5), నాగమ్మ (60), శేఖర్‌ (20)గా గుర్తించారు. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై తిప్పయ్య నాయక్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని