
Updated : 01 Jan 2022 13:02 IST
Road Accident: విశాఖలో రెండు బైకులు ఢీ.. ముగ్గురు యువకుల మృతి
విశాఖ: విశాఖలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతి వేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందడం ఆ మార్గంలో వెళుతున్న వారిని కలిచివేసింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి ప్రమాదాలు, రాస్ డ్రైవింగ్ జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నిన్న రాత్రి 8గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు ఆరిలోవ బీఆర్‌టీఎస్ రహదారిని మూసేశారు. ఆరు గంటల తర్వాత రహదారిని తెరిచిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది.
Tags :