crime news: సర్కారు బడిలోనే నాటు సారా బట్టీ

గుంటూరు జిల్లాలో నాటుసారా మాఫియా బరితెగించింది. ఏకంగా పాఠశాల ప్రాంగణంలోనే నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు

Updated : 24 Jul 2021 17:46 IST

నిజాంపట్నం: గుంటూరు జిల్లాలో నాటుసారా మాఫియా బరితెగించింది. ఏకంగా పాఠశాల ప్రాంగణంలోనే నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం హారీస్‌పేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత కొంతకాలంగా పాఠశాలకు సెలవు కావడంతో తెరవడంలేదు. ఇదే అదునుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా.. పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టారు. పాఠశాల గదికి బయట తాళం వేసి లోపల గ్యాస్‌ స్టవ్‌లతో నాటు సారా తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్టు చేసి నాటు సారాతో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడిసరకులను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో నాటు సారా తయారీ వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని