Bengaluru Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డీంఎకే ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఓ ఆడీ క్యూ3 కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో

Updated : 31 Aug 2021 09:44 IST

బెంగళూరు: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్తంభాన్ని ఢీకొని కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను పెంచింది. సోషల్‌ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు