
Published : 14 Sep 2021 01:44 IST
Gang Rape: మేడికొండూరు సామూహిక అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో ఏడుగురు!
మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొర్రపాడుకు చెందిన పాత నేరస్థులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వీరి ప్రమేయం ఉండొచ్చని విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా అనుమానితుల నుంచి ఘటనకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
ఇవీ చదవండి
Tags :