Updated : 13 Nov 2021 21:31 IST

Crime News: పూజలు చేస్తే డబ్బులు రాలేదని.. తుపాకులతో పూజారికి బెదిరింపులు

హైదరాబాద్‌: పూజలు చేస్తే డబ్బు వస్తుందని భావించారు. కానీ, ఎన్ని పూజలు చేసినా డబ్బులు రాకపోవడంతో అప్పుడు అర్థమైంది వారికి డబ్బులు ఊరికే రావని. చివరికి డబ్బుల కోసం పూజ చేసిన పూజారినే దోచుకునేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజారితో పూజలు చేయించుకోవడమే కాక అతన్ని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠా సనత్‌నగర్‌ పోలీసులకు చిక్కింది. నిందితుల నుంచి రెండు తుపాకులు, ఏడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భరత్‌నగర్‌కు చెందిన నాగేశ్వరరావు తన నివాసంలో పూజలు చేస్తే ధనవంతుడిని అవుతానని భావించాడు. ఇందుకోసం గుంటూరు జిల్లా దుర్గికి చెందిన పురుషోత్తమాచార్యులు అనే పూజారిని గతనెల 22న పూజల కోసం హైదరాబాద్‌ రప్పించాడు. 

కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పురుషోత్తమాచార్యులతో .. నాగేశ్వరరావు రెండ్రోజుల పాటు పూజలు చేయించుకున్నాడు. పూజలు పూర్తయినప్పటికీ తనకు డబ్బులు రాకపోవడంతో ఆగ్రహం చెందిన నాగేశ్వరరావు అతని అనుచరుడు రామారావు, పటేల్‌తో పాటు మరో ఐదుగురితో కలిసి పూజారిపై దాడి చేసి తుపాకులతో బెదిరించారు. పూజల కోసం ఖర్చు చసిన రూ.3లక్షలు ఇవ్వాలని పూజారిని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన పూజారి పురుషోత్తమాచార్యులు .. నాగేశ్వరరావు ముఠాకు రూ.45వేలు రెండు విడతలుగా ఇచ్చారు. మిగిలిన డబ్బుల కోసం మళ్లీ బెదిరించారు. దీంతో పూజారి పోలీసులను ఆశ్రయించారు. పథకం ప్రకారమే పూజారిని గుంటూరు నుంచి రప్పించి నాగేశ్వరరావు అతని అనుచరులు దోపిడీకి పాల్పడ్డారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని