Disha Encounter Case: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌.. కొనసాగుతోన్న సిర్పూర్కర్ కమిషన్ విచారణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్‌ను కమిషన్ ప్రశ్నించింది. పోస్టుమార్టంకు సంబంధించి దిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుధీర్‌ను ప్రశ్నించింది....

Published : 01 Oct 2021 16:02 IST

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్‌ను కమిషన్ ప్రశ్నించింది. పోస్టుమార్టంకు సంబంధించి దిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుధీర్‌ను ప్రశ్నించింది. బుల్లెట్ గాయాల వల్ల నలుగురు నిందితులు చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని సుధీర్ కమిషన్‌కు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళిని పాటించారా? లేదా? అని వైద్యుడిని అడిగింది. పోస్టుమార్టం నివేదికలోని పలు అంశాలపై కమిషన్ సభ్యులు ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు