
AP Floods: పుట్టిన రోజునే కబళించిన నది.. వరదలో కొట్టుకుపోయి అక్క, తమ్ముడు మృతి
చిన్నమండెం, న్యూస్టుడే: పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న అక్కాతమ్ముళ్లను మృత్యువు కబళించింది. మాండవ్య నది దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వారు విగతజీవులుగా మిగిలారు. కడప జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని వండాడి గ్రామం వద్ద ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు చాకిబండ గ్రామానికి చెందిన అమీర్బాషా తన కుమార్తె షేక్ సాజియా(16) పుట్టినరోజు వేడుకలు అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని భార్య, కుమారుడు షేక్ జాసిర్(11)తో ద్విచక్ర వాహనంపై చిత్తూరు జిల్లా కలకడకు బయలుదేరారు. దారి మధ్యలో మాండవ్య నది దాటుతుండగా ప్రమాదవశాత్తు సాజియా, జాసిర్ నదిలో కొట్టుకుపోయారు. కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసు గాలింపు చర్యల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.