Crime news: మహిళపై సామూహిక అత్యాచారం కేసు.. ఆరుగురికి జీవితఖైదు

మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ఎల్బీనగర్‌ న్యాయస్థానం ఆరుగురికి జీవితఖైదు విధించింది. 2019 జనవరి 19న ఓ మహిళ

Updated : 24 Aug 2021 10:06 IST

హైదరాబాద్‌: మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ఎల్బీనగర్‌ న్యాయస్థానం ఆరుగురికి జీవితఖైదు విధించింది. 2019 జనవరి 19న ఓ మహిళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని పొదల్లోకి వెళ్లింది. సమీపంలో మద్యం సేవిస్తున్న ఏడుగురు ఆ మహిళపై అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఏడుగురు నిందితులను మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మైనర్‌ కూడా ఉండటం గమనార్హం. 

ఎల్బీనగర్‌ న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. బాలనేరస్థుడికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఎల్బీనగర్‌ న్యాయస్థానం తీర్పుపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హర్షం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును పర్యవేక్షించిన మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు రవికుమార్‌, కృష్ణప్రసాద్‌లను సజ్జనార్‌ అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని