
Published : 28 Sep 2021 01:26 IST
TS News: చాక్లెట్ డబ్బాలో బంగారం స్మగ్లింగ్.. శంషాబాద్లో పట్టుబడిన వ్యక్తి
హైదరాబాద్: శంషాబాద్ విమనాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. రూ.34.24 లక్షల విలువైన 763.66గ్రా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :