Poison: రూ.1.5 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం

పాము విషం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌గఢ్‌ జిల్లా తరంగ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాము విషం విక్రయిస్తున్నారన్న సమాచారంతో శ

Published : 21 Nov 2021 07:11 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పాము విషం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌గఢ్‌ జిల్లా తరంగ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాము విషం విక్రయిస్తున్నారన్న సమాచారంతో శనివారం పోలీసులు దాడి చేశారు. రూ.1.5 కోట్ల విలువైన ఒక లీటరు విషం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబల్‌పూర్‌ జిల్లాలోని సఖిపడకు చెందిన రంజన్‌ కుమార్‌ పాఢి, సింధూరపంకకు చెందిన కైలాస్‌ సాహులను అరెస్టు చేశారు. ఆ విషాన్ని ఎక్కడ సేకరించారు? ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని