Suicide: భర్త వేధింపులు భరించలేక ఉపాధ్యాయిని ఆత్మహత్య

పిల్లలు పుట్టలేదంటూ భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలులో పాతబస్తీ బాపూజీనగర్‌కు చెందిన ఏ.భారతి(28) సి.బెళగల్‌ మండలం ఇనకండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా

Updated : 23 Dec 2021 10:56 IST

భారతి(పాతచిత్రం)

కర్నూలు నేరవిభాగం , న్యూస్‌టుడే: పిల్లలు పుట్టలేదంటూ భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలులో పాతబస్తీ బాపూజీనగర్‌కు చెందిన ఏ.భారతి(28) సి.బెళగల్‌ మండలం ఇనకండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం మేనత్త కుమారుడు గోపీకృష్ణతో వివాహమైంది. అతను స్థానిక గాంధీనగర్‌ సచివాలయంలో డిజిటల్‌ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. వారికి ఇంతవరకు సంతానం కలుగలేదు. కొంతకాలంగా భర్త ఆమెను అనుమానిస్తూ, గొడ్రాలివని అవమానిస్తుండటంతో ఆమె మనస్తాపానికి గురైంది. మంగళవారం రాత్రి ఉరేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి అక్క సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గోపీకృష్ణపై ఆత్మహత్య ప్రేరణ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని