Hyderabad News: బోయిన్‌పల్లిలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను నిరాకరించిందనే ఈ ఉన్మాదానికి ఒడిగట్టాడు. అనంతరం తానూ కత్తితో పొడుచుకున్నాడు
బోయిన్‌పల్లి: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను నిరాకరించిందనే ఈ ఉన్మాదానికి ఒడిగట్టాడు. అనంతరం తానూ కత్తితో పొడుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. యాప్రాల్ బాలాజీ నగర్‌కు చెందిన గిరీష్.. బాపూజీ నగర్‌కు చెందిన చామంతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. చామంతి స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఇవాళ యువతి ఇంటికి వెళ్లిన గిరీష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి నడుం, చేతులపై గాయాలయ్యాయి. విషయాన్ని గమనించి ఘటనా స్థలికి స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో భయానికి గురైన గిరీష్ తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..