Arrest: తమిళనాడు నేతను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

కామినేని ఆసుపత్రిని మోసం చేసిన అభియోగంపై తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు మంగళవారం అరెస్ట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శివగంగై జిల్లా

Updated : 01 Sep 2021 08:43 IST

చెన్నై, న్యూస్‌టుడే: కామినేని ఆసుపత్రిని మోసం చేసిన అభియోగంపై తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు మంగళవారం అరెస్ట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శివగంగై జిల్లా కారైకుడికి చెందిన ఎస్సార్‌ దేవర్‌.. మూవేందర్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శిగా, ఐదు జిల్లాల రైతు సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులతో వచ్చిన ఓ పోలీసు బృందం మంగళవారం దేవర్‌ను అదుపులోకి తీసుకుంది. కారైకుడి నార్త్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించాక అరెస్టు చేసి తెలంగాణకు తీసుకెళ్లింది. తెలంగాణలో కామినేని ఆసుపత్రికి రూ.300 కోట్ల రుణాలు ఇప్పిస్తానని నమ్మించి 2018లో రూ.5 కోట్లను డాక్యుమెంట్‌ ఛార్జీ కింద తీసుకొని మోసం చేసినట్టు అభియోగం. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున తిరుచుళి నుంచి దేవర్‌ పోటీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని