Ts News: అకాడమీ నిధులు మరో ఖాతాకు ఎలా బదిలీ చేశారు?: సీసీఎస్‌ పోలీసులు

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా తెలుగు అకాడమీ అధికారి రమేశ్‌, చందానగర్ శాఖ కెనరా బ్యాంకు అధికారులు, ఇతరులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నించారు. చిన్నమొత్తంలో నగదు చెల్లించే సందర్భాల్లోనూ సంతకాలను పోల్చుకునే బ్యాంకు సిబ్బంది..

Updated : 21 Dec 2022 16:27 IST

హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా తెలుగు అకాడమీ అధికారి రమేశ్‌, చందానగర్ శాఖ కెనరా బ్యాంకు అధికారులు, ఇతరులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నించారు. చిన్నమొత్తంలో నగదు చెల్లించే సందర్భాల్లోనూ సంతకాలను పోల్చుకునే బ్యాంకు సిబ్బంది.. తెలుగు అకాడమీ నిధుల విషయంలో ఎందుకు నిర్లిప్తత వహించారని కెనరా బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. డిపాజిట్‌ చేసిన ఖాతాకు కాకుండా మరో ఖాతాకు ఎలా బదిలీ చేశారని బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. కేవలం లేఖల ఆధారంగా కోట్ల రూపాయల నగదును వేరే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడాన్ని బ్యాంకు అధికారుల వద్ద పోలీసులు ప్రస్తావించారు. తెలుగు అకాడమీ అధికారుల పేరుతో వచ్చిన లేఖలను నమ్మి డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి జమ చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు తెలిపారు. రూ.63 కోట్లు డిపాజిట్ చేసినప్పుడు కనీసం బ్యాంకుకు వెళ్లకుండా కేవలం ఏజెంట్ల మీద ఎందుకు ఆధారపడ్డారని తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్‌ను ప్రశ్నించారు. కెనరా బ్యాంకు అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా అకాడమీ అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించే ఏజెంట్లు ఈ మోసానికి తెరలేపారా? లేకపోతే వీళ్ల వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని