Telugu akademi: లెక్కతేలని రూ.63 కోట్లు.. నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్‌ పోలీసులు

తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో ఆరుగురు నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న సాయి

Published : 04 Dec 2021 01:29 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో ఆరుగురు నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న సాయి కుమార్‌, వెంకటరమణ, సోమశేఖర్‌, వెంకట్‌, రమేశ్‌, సత్యనారాయణలను పోలీసులు సీసీఎస్‌కు తరలించారు. ఇవాళ, రేపు నిందితులను ప్రశ్నించనున్నారు. తెలుగు అకాడమీకి చెందిన రూ.63కోట్లు వాటాలుగా పంచుకున్న నిందితులు.. వాటిని ఎక్కడికి మళ్లించారనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. రూ.63 కోట్లకు లెక్క తేలకపోవడంతో డిపాజిట్ల గోల్‌మాల్‌లో కీలక పాత్ర పోషించిన నిందితులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈకేసులో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీళ్లంతా డబ్బును వాటాలుగా పంచుకొని పలుచోట్లు పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని