Telugu Akademi Scam: కస్టడీలో మస్తాన్‌ వలీ.. ఎంత సొమ్ము ఖాతాలోకి జమ చేసుకున్నారు?

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలకంగా వ్యవహరించిన యూబీఐ

Published : 07 Oct 2021 01:04 IST

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలకంగా వ్యవహరించిన యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీని కస్టడీలోకి తీసుకున్నారు. 6 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు మస్తాన్‌ వలీని పోలీసులు ప్రశ్నించారు. మిగిలిన నిందితులతో కలిసి నిధులు గోల్ మాల్ చేసిన వ్యవహారంలో తీసుకున్న కమీషన్ గురించి ప్రశ్నించారు. కొల్లగొట్టిన నిధుల్లో ఎంత సొమ్ము ఖాతాలోకి జమ చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో మరో 8 మందిని సీసీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. మరో వైపు స్వాహా చేసిన సొత్తుతో నిందితులు కొన్న ఆస్తులు, ఇచ్చిన అప్పులు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలనేదానిపై పోలీసులు న్యాయసలహా కోరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని