Crime News: పొరుగింటి వారు ఊరేళ్లారని తెలుసుకొని..

పక్కింటివారు మరో ఊరు వెళ్లారని తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనానికి దిగాడు ఓ వ్యక్తి. ఉండవల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు

Published : 19 Oct 2021 02:02 IST

గుంటూరు‌: పక్కింటివారు మరో ఊరు వెళ్లారని తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనానికి దిగాడు ఓ వ్యక్తి. ఉండవల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.30 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ఉండవల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దినేష్ పండగ సందర్భంగా గుంటూరులోని తన అత్తవారింటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పక్కింటి వ్యక్తి విజయవాడకు చెందిన కొర్రపాటి వీరనాగరాజు.. దినేష్‌ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించి 688 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. కాజేసిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నించి ఇవాళ పోలీసులకు చిక్కాడు. ప్రధాన నిందితుడు వీరనాగరాజు సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 688 గ్రాముల బంగారు అభరణాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన నాగరాజుపై అప్పటికే పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. ఐటీ కోర్ టీం సహాయంతో దర్యాప్తును చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ చెప్పారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని