crime news: సెల్‌ఫోన్లు చోరీ చేసి.. సీసీ కెమెరాలో చిక్కి

మొబైల్‌ స్టోర్‌లో సెల్‌ఫోన్‌లు చోరీకి గురైన ఘటన సికింద్రాబాద్‌ కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.  నిన్న రాత్రి సంగీత మొబైల్‌ స్టోర్‌లోకి చొరబడిన

Updated : 31 Oct 2023 16:02 IST

హైదరాబాద్‌: మొబైల్‌ స్టోర్‌లో సెల్‌ఫోన్‌లు చోరీకి గురైన ఘటన సికింద్రాబాద్‌ కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.  నిన్న రాత్రి సంగీత మొబైల్‌ స్టోర్‌లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడ్డారు. రూ.15లక్షల విలువైన సెల్‌ఫోన్లు అపహరించుకుని వెళ్లిపోయారు. ఉదయాన్నే మొబైల్‌ స్టోర్‌కి వచ్చిన యజమాని చోరీ జరిగిన తీరు చూసి షాక్‌కు గురయ్యారు. రూ.లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురవడంతో వెంటనే కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌ సాయంతో వేలిముద్రలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పక్కా ప్రణాళికతో దొంగల ముఠా సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని