Telugu Akademi Scam: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసు: మరో ముగ్గురి అరెస్టు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో మరో ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌ను అదుపులోకి తీసుకొన్నారు.

Published : 10 Oct 2021 01:29 IST

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో మరో ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సురభి వినయ్‌ తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి పీఏగా పనిచేశారు. రమణారెడ్డి ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. భూపతికి ఎఫ్‌డీల నకిలీ పత్రాలతో సంబంధం ఉందని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 14కి చేరింది. రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ పోలీసులు ఆధారాల కోసం సమగ్ర విచారణ జరుపుతున్నారు. కొట్టేసిన డబ్బును నిందితులు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. నిందితులు మనీల్యాండరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని