
Crime news: ‘అనంత’లో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమడగూరు మండలంలోని ములకవారిపల్లితండాలో చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. చెరువులోకి దిగిన చిన్నారులు.. ప్రమాదవశాత్తు గల్లంతు కావడంతో వారి ఆచూకీ కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో లాలూ ప్రసాద్ నాయక్ నాలుగో తరగతి చదువుతుండగా.. పురుషోత్తం నాయక్ ఆరో తరగతి, హేమంత్ నాయక్ ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సరదాగా చెరువు వైపు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం సాయంత్రం వరకు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఒకే తండాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
-
Ap-top-news News
Andhra News: వైకాపాకు ఓటేసి తప్పు చేశాం.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసన
-
Movies News
Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- రూ.19 వేల కోట్ల కోత
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- బడి మాయమైంది!