Crime news: గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి కాల్పులు: ఇద్దరి మృతి

గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. విరాల్లోకి వెళితే.. ...

Updated : 29 Aug 2021 22:14 IST

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు దారుణానికి ఒడిగట్టాడు. పొలం తగాదా విషయంలో ఘర్షణ తలెత్తి సాంబశివరావు అనే మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొలం వివాదం నేపథ్యంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్తోల్‌తో దగ్గర నుంచి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. మట్టా శివ, బాలకృష్ణ, ఆంజనేయులు తల, శరీర భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన వారిని మాచార్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివ, బాలకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆంజనేయులును మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పుల ఘటనతో రాయవరం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని