
AP News: రథోత్సవంలో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో విషాదం చోటు చేసుకుంది. చింతాల మునిస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఇద్దరు భక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఉదయం రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి విద్యుత్ తీగలు తీగలడంతో ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అదే గ్రామానికి చెందిన వీరాంజనేయులు, వెంకటేశులుగా గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.