Hyderabad News: రాజేంద్రనగర్‌లో రెండేళ్ల చిన్నారి అదృశ్యం

రాజేంద్రనగర్‌లో రెండేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం తల్లిదండ్రులు..

Updated : 28 Aug 2021 14:16 IST

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌లో రెండేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం తల్లిదండ్రులు అబ్దుల్‌ రహీమ్‌, తబుసుమ్‌ చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని