TS News: ట్రయల్‌రూంలో యువతి డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో..!

పోకిరీల చేష్టలు రోజురోజుకీ మితిమీరుపోతున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని హెచ్‌ అండ్‌ ఎం షాపింగ్‌మాల్‌ ట్రయల్‌రూంలో

Published : 06 Nov 2021 01:57 IST

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు పోకిరీలు, స్టోర్‌ మేనేజర్‌ అరెస్ట్

జూబ్లీహిల్స్‌: పోకిరీల చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని హెచ్‌ అండ్‌ ఎం షాపింగ్‌మాల్‌ ట్రయల్‌రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. గమనించిన యువతి మొదట కేకలు వేయడంతో అక్కడున్నవారు యువకులను పట్టుకున్నారు. అనంతరం డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువతి ఆ వీడియోను డిలీట్‌ చేయించారు. వీడియో తీసిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ ఆమన్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. యువకుల చరవాణిలో ఇలాంటి దృశ్యాలు మరికొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలను ఎక్కడైనా చిత్రీకరించారా.. లేకపోతే అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని