TS News: మంటగలిసిన మానవత్వం: వృద్ధుడిని చాపలో చుట్టి..

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు చాపలో చుట్టి రహదారి పక్కన పడేసి వెళ్లారు...

Updated : 26 Aug 2021 11:15 IST

అడ్డగూడూరు: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు చాపలో చుట్టి రహదారి పక్కన పడేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాన్ని రప్పించి అచేతన స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి వివరాలను సేకరిస్తున్నారు. వృద్ధుడిని చాపలో చుట్టి ఇలా ఎందుకు పడేశారు? పడేసిన వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని