Ap news: యువతిపై పెట్రోల్‌ దాడి కేసులో నిందితుడి అరెస్టు

జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ

Published : 21 Aug 2021 01:25 IST

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ దీపిక పాటిల్‌ ... నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడు సరవ గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించామని, కృష్ణాపురం గ్రామంలో అతడ్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితుడిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదుచేశామని, ఇతరుల పాత్రపైనా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. యువతిపై దాడి కోసం పెట్రోల్‌ను ఓ ద్విచక్రవాహనం నుంచి తీసినట్టు నిందితుడు అంగీకరించాడని తెలిపారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలే హత్యాయత్నానికి దారితీశాయని వెల్లడించారు. ఈకేసులో మరికొంతమంది అనుమానితులను విచారించాల్సి ఉందన్నారు. ఘటనపై తక్షణం పోలీసులకు సమాచారం రావటం, బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందటంలో దిశ యాప్‌ ప్రముఖ పాత్ర పోషించిందని ఎస్పీ చెప్పారు. దాడిని అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా మంటలు అంటుకున్నాయని, ముగ్గురు బాధితులకు విజయనగరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు