Updated : 02/09/2021 04:40 IST

Viveka Murder Case: సునీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతి నిరాకరణ

జమ్మలమడుగు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను నార్కో పరీక్షలకు అనుమతించాలని కోరుతూ సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో పది రోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇవాళ.. కడప జైలు నుంచి సునీల్‌ యాదవ్‌ వర్చువల్‌గా మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరయ్యారు. నార్కో పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతితో పాటు, నార్కో పరీక్ష చేయించుకునే వ్యక్తి సమ్మతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని సునీల్‌ యాదవ్‌ను మేజిస్ట్రేట్‌ అడగ్గా.. సమ్మతం కాదని సునీల్‌ తెలిపారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను తిరస్కరించింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని