VIVEKA MURDER CASE: రెండో రోజు దొరకని మారణాయుధాలు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన్ను హత్య చేసేందుకు వినియోగించిన గొడ్డలి, ఇతర మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు

Published : 08 Aug 2021 19:44 IST

పులివెందుల: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన్ను హత్య చేసేందుకు వినియోగించిన గొడ్డలి, ఇతర మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా మారణాయుధాల్ని వెలికితీసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. 20 మంది మున్సిపల్‌ సిబ్బందితో నిన్న, ఈరోజు పులివెందుల రోటరీపురం వాగులో మరికినీరు తొలగించి, యంత్రాలతో మట్టి తొలగించి గాలంచినా ఫలితం లేకపోయింది. రోటరీ పురం ఎడమ భాగంలో అన్వేషణ పూర్తయింది. సీబీఐ కస్టడీలో ఉన్న కీలక అనుమానితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మున్సిపల్‌ సర్వే సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. ఆ ప్రాంతం వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

వివేకా హత్యకేసు అనుమానితులు మరోసారి పులివెందులలో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, ప్రకాశ్‌రెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్‌ను సీబీఐ విచారించింది. మరో వైపు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఆదివారం పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని