
Crime news: పెళ్లి పేరుతో 19 మంది మహిళలను మోసం చేసిన విలియమ్స్ అరెస్టు
నల్గొండ: చర్చికి వస్తున్న మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని నల్గొండకు చెందిన విలియమ్స్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశాడని, మరో 19మంది మహిళలు ఆయన ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. చర్చిలో పియానో వాయించే విలియమ్స్ అక్కడికి వచ్చే మహిళలను మాయమాటలతో లొంగదీసుకున్నాడని ఈనెల 5న ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తుండగా గుండెపోటు వచ్చిందని విలియమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరీక్షల్లో గుండె పోటు వచ్చినట్టు నిర్థరణ కాకపోవడంతో పోలీసులు విలియమ్స్‌ను అరెస్టు చేశారు. అతని భార్య, కుటుంబ సభ్యులు మాత్రం.. డబ్బుల కోసమే మహిళ ఫిర్యాదు చేసిందని, ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.