Mumbai Drugs Case: ముంబయి రేవ్‌ పార్టీ.. ‘శానిటరీ న్యాప్‌కిన్స్‌’లో డ్రగ్స్‌ సరఫరా

ముంబయి క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీలో ఓ మహిళా నిందితురాలు శానిటరీ న్యాప్‌కిన్‌లో డ్రగ్స్‌ తీసుకెళ్లినట్లు తేలింది.

Published : 11 Oct 2021 02:06 IST

వెల్లడించిన ఎన్‌సీబీ అధికారులు

ముంబయి: డ్రగ్స్‌ దందాను పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకున్నా.. ముఠా సభ్యులు పలు విధాలుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీలో ఓ మహిళా నిందితురాలు శానిటరీ న్యాప్‌కిన్‌లో డ్రగ్స్‌ తీసుకెళ్లినట్లు తేలింది. ఆమెనుంచి ఐదు గ్రాముల డ్రగ్స్‌ను నార్కొటిక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

ఈ నెల మూడవ తేదీన ముంబయి క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్‌ ఖాన్‌ ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో ఆర్యన్‌ ఖాన్‌తో పాటు మరో 7గురు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

ఇక ముంబయి డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో దూకుడుగా వెళుతున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వారినే విచారిస్తునారు. ఇందులో భాగంగా ఆర్యన్‌ ఖాన్‌ కారు డ్రైవర్‌ను ఇప్పటికే ప్రశ్నించారు. కేసు విచారణలో భాగంగా అక్టోబర్‌ 11న తమముందు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్‌ ఇంతియాజ్‌ ఖత్రీకి ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని