Crime News: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఇంటి యజమాని కుమారుడు

బాత్రూమ్‌లో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌బాత్రూమలో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌

Updated : 11 Dec 2021 16:52 IST

హైదరాబాద్‌: బాత్రూమ్‌లో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో ఉదంతం వెలుగు చూసింది. ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడని ఫిలింనగర్‌కు చెందిన  బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 నెలలుగా ఇంటి యజమాని కుమారుడు ..తాను  స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా అతనికే మద్దతు పలుకుతున్నారని ఆమె వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని