
Crime News: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు సజీవదహనం
బెంగళూరు: బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్ పైప్‌లైన్ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళ సహా ఇద్దరు సజీవదహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.